ఐపీఎల్ అనంతరం భారత జట్టు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు మే 26న తుది జట్టును ప్రకటించే అవకాశం ఉంది. చేతన్ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఈనెల 23న సమావేశం కానుంది. ఈ సమావేశానికి కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడ హాజరుకానున్నారు. మొత్తం 15 మంది ఆటగాళ్లతో జట్టును ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 5 టీ20 మ్యాచులు జరుగనున్నాయి.