చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరుగుతున్న వరల్డ్ కప్ మొదటి మ్యాచులో ఇండియన్ వుమెన్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియన్ కెప్టెన్ మిథాలీ రాజ్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జులన్ గోస్వామికి ఇదే ఆఖరు వరల్డ్కప్. దీంతో ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసిలో ఇండియన్ మహిళలు ఉన్నారు. ఇంతవరకూ ఇండియన్ మహిళలు ట్రోఫీని ముద్దాడలేదు. నేడు పాక్ మీద గెలిచి వరల్డ్కప్ వేటను విజయంతో ఆరంభించాలని ఉవ్విళ్లూరుతున్నారు.