• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • తడబడ్డా కానీ నిలబడ్డ.. ఇండియన్ వుమెన్స్…

    పాక్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడుతున్న ఇండియన్ వుమెన్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన షఫాలీ వర్మ డకౌట్‌గా వెనుదిరిగిన కానీ మరో ఓపెనర్ స్మృతి మంధాన (52) ఆకట్టుకుంది. వన్ డౌన్‌లో వచ్చిన దీప్తి శర్మ(40) కూడా పరవాలేదనిపించింది. కానీ ఆ తర్వాత పాక్ బౌలర్లు రెచ్చిపోయారు. వెంటవెంటనే వికెట్లు తీసి భారత్‌ను చిక్కుల్లో పడేశారు. అటువంటి తరుణంలో స్నేహ్ రానా (53*), పూజా (67) ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టారు. వీరిద్దరి పోరాటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేశారు. పాక్ వుమెన్స్ బౌలర్లలో దార్, సంధు చెరి 2 వికెట్లు తీసుకోగా.. డైనా, అమీన్, సనా తలో వికెట్ తీసుకున్నారు.