ఇంగ్లండ్-వేల్స్ ప్రాంతంలో నివసిస్తున్న విదేశీయుల్లో ప్రతి ఆరుగురిలో ఒక్కరు భారతీయులేనని యూకే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం వెల్లడించింది. 2021 జనాభా గణనాంకాల ప్రకారం ఈ ప్రాంత ప్రజల్లో 1.5 శాతం మంది భారతీయులే ఉన్నట్లు పేర్కొంది. భారత్‌లో జన్మించిన వారు మొత్తం 9.2 లక్షల మంది ఉండగా, ఆ తర్వాత 7.43 లక్షల మంది పోలండ్ దేశానికి చెందినవారు ఇంగ్లండ్‌లో ఉన్నట్లు తెలిపింది. పదేళ్లలో విదేశాల్లో జన్మించి ఇంగ్లండ్‌కు చేరుకున్న వారి సంఖ్యం 25 లక్షలు దాటిందని అందులో ఎక్కువ భాగం భారతీయులేనని నివేదికలో పేర్కొంది.
ఇంగ్లండ్ జనభాలోనూ భారతీయులే!

© Envato