ఒకప్పుడు ఏదైనా వార్త తెలియాలంటే రేడియోనో, పేపర్ మీదో ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు క్షణాల వ్యవధిలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత పవర్ఫుల్గా మారింది సోషల్ సోషల్ మీడియా. ఇందులో వచ్చే వార్తల్లో నిజమేదో, అబద్దమేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు అధికంగా నమ్ముతున్నారని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అందులో అధికంగా ఇండియన్స్ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను అధికంగా నమ్ముతున్నారట. ఇండియాలో సుమారు 54 శాతం మంది సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్ముతున్నారని, మెక్సికోలో 43 శాతం సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారట. బ్రిటన్లో అత్యల్పంగా 16శాతం మంది మాత్రమే సోషల్ మీడియాను ట్రస్ట్ చేస్తున్నారని వెల్లడించింది.