పార్లమెంట్‌లో రేపు ఆందోళన చేయాలని భారాస నిర్ణయించింది. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని నిరసిస్తూ విపక్షాలతో కలిసి నిరసన తెలిపాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆప్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ సహా ఇతర విపక్ష పార్టీల నేతలతో చర్చించారు. సమావేశాలను స్తంభింపజేయాలని చూస్తున్నారు. పార్లమెంట్ బయట కూడా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. రేపట్నుంచి రెండో విడత పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.