భారతదేశంలో తొలిసారిగా నిర్మిస్తున్న వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపుగా 81శాతం పూర్తయిందని రైల్వేశాఖ తెలిపింది. ఈ పాంబన్ బ్రిడ్జి రామేశ్వరం ద్వీపాన్ని తమిళనాడులోని ధనుష్కోడి రైల్వేలైన్‌ను కలుపుతుంది. ఇది అధిక బరువులను మోయగలదు. అలాగే ఎత్తులో నిర్మించడం కారణంగా వంతెన కిందనుంచి ఓడలు కూడా వెళ్తాయి. వచ్చే ఏడాది కల్లా దీనిని అందుబాటులోకి తేవాలని రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది.