మూడో వన్డేలో టీమిండియా చరిత్రాత్మకమైన విజయం సాధించింది. శ్రీలంకపై ఏకంగా 317 పరుగుల తేడాతో గెలుపొందింది. వన్డేల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గతంలో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలుపొందింది. 391 పరుగుల లక్ష్య ఛేదనలో లంక బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. సిరాజ్(4), కుల్దీప్(2), షమి(2) శ్రీలంక బ్యాటర్ల పనిపట్టారు. దీంతో శ్రీలంక కేవలం 73 పరుగులే చేయగలిగింది. అషెన్ బందారా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ విజయంతో శ్రీలంక సిరీస్‌ని టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. స్కోర్లు: భారత్ 390/5 (50), శ్రీలంక 73 ఆలౌట్(22)