సెప్టెంబర్ 30 నుంచి వందే భారత్ పరుగులు ?

© ANI Photo

పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన వందే భారత్ ఎక్స్‭ప్రెస్ రైలు ఈనెల 30వ తేదీ నుంచి పరుగులు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమవడంతో ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ రైలును నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తులు ప్రారంభించింది. ఈ రైలుకు భద్రతాపరమైన అనుమతులన్నీ లభించాయి. కాగా ఈ రైలు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 52 సెకండ్లలోనే 100 మీటర్ల దూరాన్ని అందుకోగలదు.

Exit mobile version