వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభమన్ గిల్(64), ధావన్(97) మెరుపులతో 308/7 స్కోరు చేసింది. 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ చివరి బంతి వరకు పోరాడి ఓడింది. 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది.విండీస్ ఆటగాళ్లలో మెయర్స్ 75, బ్రాండన్ కింగ్ 54 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్,శార్దుల్, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శిఖర్ ధావన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
ఉత్కంట పోరులో విండీస్ పై భారత్ గెలుపు

Courtesy Instagram:indiancricketteam