బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. తీవ్ర ఒడుదొడుకుల మధ్య కదలాడిని సూచీలు రోజు ముగిసే సమయానికి స్వల్ప నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 9.98 పాయింట్లు నష్టపోయి 60,105.50 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీలు కూడా కూడా స్వల్పంగా పడిపోయాయి. 18.43 పాయింట్లు నష్టాన్ని చవిచూసి 17,895.70 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో నిఫ్టీ 17,824.35 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ షేర్లలో 14 మాత్రమే లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ తదితర షేర్లు నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.59 వద్ద ముగిసింది.