ప్రముఖ విమానయాన కంపెనీ ఇండిగో ఎయిర్లైన్స్ వెబ్సైట్ హ్యాక్ అయింది. నందన్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కంపెనీ వెబ్సైట్ను హ్యాక్ చేశాడు. తన లగేజీ తారుమారు కావడంతో దానిని కనిపెట్టేందుకు నందన్ ఈ పని చేశాడు. ఆ తర్వాత మీ వెబ్సైట్ సురక్షితంగా లేదంటూ ఇండిగో యాజమాన్యానికే ట్వీట్ చేశాడు. ఇది చూసిన ఇండిగో ప్రయాణికుల డేటా సురక్షితంగానే ఉందని తెలిపింది.