• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • INDvsSL: మొదలు, చివర అదరగొట్టారు!

    లంకతో తొలి టీ20లో భారత బ్యాటర్లు తొలి, చివరి రెండు ఓవర్లు అదరగొట్టారు. మధ్యలో లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేశారు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు తొలి ఓవర్‌లో 17 రన్లతో నిరాశపరిచే ఓపెనింగ్‌ వచ్చింది. అయితే వెంటనే పుంజుకున్న లంక…. చక చకా వికెట్లు తీస్తూ పోయింది. 46 కే 3 వికెట్లతో ఓ దశలో టీమిండియా కష్టాల్లో పడింది. అయితే చివర్లో దీపక్‌ హుడా, అక్షర్ పటేల్‌ చక్కగా ఆడారు. హుడా 23 బంతుల్లో 41 పరుగులు, అక్షర్ పటేల్‌ 20 బంతుల్లో 31, ఇద్దరూ కలిసి 35 బంతుల్లో 68 కొట్టడంతో భారత్‌ 162 పరుగుల మోస్తరు స్కోరు చేయగలిగింది.