INDvsWI: తర్వాతి రెండు మ్యాచ్‌లు అమెరికాలోనే

Twitter:BCCI

విండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తర్వాతి రెండు మ్యాచ్‌లపై సందిగ్ధత వీడింది. ఈ రెండు మ్యాచ్‌లు ఫ్లోరిడాలోనే జరుగుతాయని విండీస్ బోర్డు ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడాలోనే మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా..విండీస్ ఆటగాళ్లకు వీసా ఇబ్బందులు తలెత్తడంతో వెస్టిండీస్‌లోనే నిర్వహించాలని భావించారు. కానీ సమయానికి విండీస్ ఆటగాళ్లకు వీసాలు అందడంతో..తర్వాతి రెండు మ్యాచ్‌లు అమెరికాలోనే నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.

Exit mobile version