ప్రియుడిపై మోజుతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను నడిరోడ్డుపై వదిలేసింది. రోడ్లపై తిరుగుతున్న ఆ చిన్నారులను పోలీసులు చేరదీశారు.ఈ ఘటన యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు. ఆమెను భర్త వదిలేయడంతో ఓ ఆటోడ్రైవర్‌తో సహజీవనం చేస్తోంది. వీరికి ఒక పాప కూడా కలిగింది. ఈ క్రమంలో సహజీవనానికి అడ్డు వస్తున్నారనే కారణంతో అర్ధరాత్రి చిన్నారులను ఆటోలో తీసుకువచ్చి వదిలేసి వెళ్లారు.