యూపీలోని కాన్పూర్‌లో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ విజృంభిస్తోంది. నగరంలోని హాల్లెట్ ప్రభుత్వ ఆసుపత్రికి ఒక్క రోజులో 200 కేసులు వచ్చాయి. వీటిల్లో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలలకు కూడా జ్వర బాధితులు పోటెత్తారు. హెచ్3ఎన్2 సోకిన 92శాతం వ్యక్తుల్లో జ్వరం, ఒళ్లు నొప్పులు, 86 శాతం రోగుల్లో తీవ్రమైన దగ్గు, 27 శాతం బాధితుల్లో ఊపిరి అందకపోవడం, విపరీతమైన తుమ్ములు ప్రధాన లక్షణాలుగా ఉంటున్నాయి.