వచ్చే ఏడాది జనవరి నాటికి విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ మేరకు ఇన్ఫోసిస్ ప్రతినిధులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. మధురవాడ ఐటీ హిల్స్‌లో ఈ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మొదటి దశలో దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు రానున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ రాకతో వైజాగ్ ఐటీ అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘త్వరలో వైజాగ్‌కు ‘ఇన్ఫోసిస్’’

Courtesy Twitter:GUDIVADAAMARNATH