రాజస్థాన్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ దళిత మహిళపై కొందరు యువకులు రోజుల తరబడి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ దళిత మహిళ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు సంజయ్ శర్మ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడి వీడియో తీశాడని, అనంతరం ఆమెను బెదిరించి అతని స్నేహితుల కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. భార్య ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను గత నెల 27న పోలీస్ స్టేషన్ ముందు వదిలేసి వెళ్లారని తెలిపారు.
రాజస్థాన్లో అమానుషం.. దళిత మహిళపై అత్యాచారం

© Envato