• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.10వేల కోట్ల పరిహారం కోరిన నిర్దోషి

    సామూహిక అత్యాచారం కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తి భారీ నష్ట పరిహారాన్ని కోరారు. రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడంతో మానసికంగా, శారీరకంగా, సామాజికంగా తన కుటుంబం ఎంతో నష్టపోయిందని బాధిత వ్యక్తి పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాకు చెందిన కాంతిలాల్ సింగ్ ఈ పిటిషన్‌ని దాఖలు చేశారు. తనకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.10.6 వేల కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నాడు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులను ప్రతివాదులుగా చేర్చాడు. దీంతో రత్లాం జిల్లా కోర్టు ఈ నెల 10న పిటిషన్‌ని విచారణ చేయబోతోంది.