తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు సోమవారం ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది. 2023 మార్చి 15 నుండి పరీక్షలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ఫిబ్రవరి 15 నుండి మార్చి రెండో తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు పరీక్షల విధివిధానాలను ఇంటర్మీడియట్ కళాశాలలు తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.