తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఈనెల 25న విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. పరీక్షలు మే 24తో పూర్తి కాగా, ఈనెల 8 నుంచి జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. జూన్ 20 లోపే ఫలితాలు వెల్లడిస్తామని చెప్పినా…సాఫ్ట్ వేర్ తప్పిదాలు లేకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. దీంతో జూన్ 25న ఫలితాలు వెల్లడించేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫెయిలయ్యే విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు గతంలోనే ప్రకటించింది.