ఈనెల 30న ఇంటర్ సప్లమెంటరీ రిజల్ట్స్

© ANI Photo

ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు ఈనెల 30న వెల్లడి కానున్నట్లు తెలిసింది. అయితే దీనిపై ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈరోజు లేదా రేపు దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. విద్యార్థులు తమ ఫలితాలను bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు గోదావరి వరదల్లో ముంపునకు గురై సప్లిమెంటరీ పరీక్షలు రాయలేకపోయిన విద్యార్ధులకు బోర్డు శుభవార్త చెప్పింది. పరీక్ష రాయలేకపోయినా విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Exit mobile version