అల్లు అర్జున్-రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ వచ్చింది. పార్ట్ 2 స్క్రిప్ట్ విషయంలో చర్చించడానికి పుష్ప టీమ్ తమిళనాడులోని కూనూర్ కు వెళ్లారట. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాక జూన్ లేదా జులైలో షూటింగ్ ను మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు అభిమానులతో సంతోషాన్నిచ్చే మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు పార్ట్ 3 కూడా తీసే విధంగా దర్శకుడు ఆలోచిస్తున్నాడట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో వేచిచూడాలి.