రెండు పెద్ద సంస్థలైన జీ గ్రూప్ ఇంకా సోనీ విలీనం అయ్యేందుకు చూస్తున్నాయి. అయితే ఈ విలీనంలో జీ నెట్‌వర్క్‌కు పూర్తిగా సహకరిస్తామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని అతి పెద్ద వాటాదారు ఇన్వెస్కో గ్రూప్ స్పష్టం చేసింది. ఈ విలీనం వలన జీ గ్రూప్ వాటాదార్లకు మేలు జరుగుతుందని ఇన్వెస్కో తెలిపింది. ఇన్వెస్కో తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీ ఎంటర్టైన్మెంట్ స్వాగతించింది.