తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అక్రమ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో కేటీఆర్ వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. 2009లో రూ.4 కోట్లు.. 2014లో రూ.8 కోట్ల ఆస్తులు ఉండగా.. 2018 నాటికి రూ.42 కోట్లకు కేటీఆర్ ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగంతోనే కేటీఆర్ అక్రమ ఆస్తులు సంపాదించారని ఆయన ధ్వజమెత్తారు.