దావోస్ పర్యటన విజయవంతమైందని, నాలుగు రోజుల్లోనే తెలంగాణకు రూ.21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్లో తెలిపారు. ఆ వివరాలు
రూ.16,000 కోట్లతో మూడు మైక్రోసాఫ్ట్ డేటా కేంద్రాలు.
రూ.2,000 కోట్లతో దేశంలోని అతిపెద్ద భారతీ ఎయిర్టెల్ డేటా కేంద్రం
రూ.1,000 కోట్లతో జీనోమ్ వ్యాలీలో ఫ్రాన్స్ సంస్థ యూరోపిన్స్ ల్యాబ్.
రూ.1,000 కోట్లతో పెప్సికో విస్తరణ.
రూ.210 కోట్లతో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ సంస్థ.. మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం.
రూ.150 కోట్లతో వెబ్ పీటీ సంస్థ ప్రపంచ స్థాయి సామర్థ్య కేంద్రం.
రూ.100 కోట్లతో అపోలో టైర్స్ డిజిటల్ ఆవిష్కరణల కేంద్రం.
రూ.100 కోట్లతో ఇన్స్పైర్ బ్రాండ్స్ ప్రపంచస్థాయి మద్దతు కేంద్రం.
రూ.100 కోట్లతో ప్రపంచ ఆర్థిక వేదిక 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రం(సీ4ఐఆర్)