శ్రీలంకలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ యూనిట్ గురువారం అర్ధరాత్రి భారీగా ఇంధన ధరలు పెంచేసింది. పెట్రోల్, డీజిల్ ధరలను 50, 75 రూపాయలు పెంచింది. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ రూ.254కు చేరుకోగా, డీజిల్ 214 రూపాయలకు చేరింది. శ్రీలంక రూపాయి విలువ దాదాపు 15 శాతం పడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇందుకు ఓ కారణమని అంటున్నారు. గ్లోబల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా లంక ఐఓసీ ఇంధన ధరలను ఇప్పటికే రెండు సార్లు పెంచింది.