IPL అభిమానులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. తమ స్టేడియాల్లో జరిగే మ్యాచులకు 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది. కాని రెండు డోసులు టీకా తీసుకున్న వారికి మాత్రమే ఎంట్రీ ఉండనుంది. బీసీసీఐ, మహారాష్ట్ర క్రికెట్ సంఘం సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మ్యాచులను ప్రేక్షకులు వీక్షించడానికి చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.