టాటా ఐపీఎల్ 2022లో భాగంగా నేడు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 189 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్‌లో బెయిర్ స్టో(56), జితేష్ శర్మ(38) రాణించడంతో నిర్ణిత ఓవర్లలో పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేయగలిగింది. అటు రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 3, అశ్విన్, ప్రసిద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు. కాగా మీ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే 190 పరుగులు చేయాల్సి ఉంటుంది.