IPL: మరో సెంచరీ చేసిన జాస్ బట్లర్

Courtesy Instagram:rajasthanroyals

రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్ ఐపీఎల్‌లో మరో సెంచరీ చేశాడు. కానీ ఈ సారి అతడు సెంచరీ చేసింది పరుగుల విషయంలో కాదు.. సిక్సర్ల విషయంలో అదేంటి అనుకుంటున్నారా.. అవును జాస్ బట్లర్ నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 100 సిక్సర్లు బాదిన ఆటగాళ్ల క్లబ్‌లో చేరిపోయాడు. ఈ క్లబ్బులో చేరిన 26 ఆటగాడు బట్లర్. తొలి స్థానంలో 357 సిక్సర్లతో యూనివర్సల్ బాస్ గేల్ కొనసాగుతున్నాడు. ఈ ఫీట్‌ను అందుకోవడానికి బట్లర్ 69 ఇన్నింగ్సులు ఆడాడు.

Exit mobile version