ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా నేడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్.. లక్నో బ్యాటర్లను ఓ ఆట ఆడుకుంది. బౌలర్ షమీ తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ వికెట్ తీసి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు పడడంతో లక్నో 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిడిలార్డర్ బ్యాటర్లు, దీపక్ హుడా(55), ఆయుష్ బదోని (54), చివర్లో కృనాల్ పాండ్యా (21) ఆదుకోవడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లో షమీ 3, ఆరోన్ 2, రషీద్ ఓ వికెట్ తీశారు.