IPL: మాజీ చాంపియన్ మంబైకి ఏమైంది మావా?

© IPL Photos - IPLT20.com

ఐపీఎల్ పోరు రంజుగా సాగుతోంది. లీగ్‌లో చాలా జట్లు మొదటి విజయాలను అందుకున్నాయి. కానీ కొన్ని జట్లు మాత్రం ఇంకా మొదటి విక్టరీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాయి. అందులో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఒకటి. మొదటి మ్యాచ్ ఓడితే ముంబైకి ఇది మామూలే అనుకున్నారంతా.. కానీ రెండో మ్యాచ్ కూడా ఓడిపోవడంతో అంతా విస్తుపోయారు. ముంబై జట్టుకు ఏమైందా అని కామెంట్లు చేశారు. మరి ముంబై ఈ రోజు మరో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. మరి ఈ మ్యాచులో ఎవరు సత్తా చాటుతారో అని అంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ముంబై జట్టుకు ఇటువంటి పరిస్థితి ఎదురు కాలేదని కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version