లక్నోపై గెల్చిన రాజస్థాన్ రాయల్స్‌

ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన 20వ ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పై రాజస్థాన్ రాయల్స్‌ జట్టు విజయం సాధించింది. తక్కువ స్కోర్ ఉన్నప్పటికీ లక్నో టీం.. రాజస్థాన్ బౌలర్ల దాటికి గెలవలేకపోయింది. అయితే మొదట టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాజస్థాన్ టీం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇక చేధనకు దిగిన లక్నో జట్టు 8 వికెట్ల నష్టానికి 162 రన్స్ చేసి విఫలమైంది.

Exit mobile version