ఈ నెల 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. నూతన జెర్సీని బీసీసీఐ కార్యదర్శి జై షా, ఎల్ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గొయెంకా, జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, మెంటార్ గౌతమ్ గంభీర్ లాంఛ్ చేశారు. కాగా జెర్సీని ముదురు నీలం రంగులో రూపొందించారు. జెర్సీ అంతటా ఎల్ఎస్‌జీ అని రాసి ఉంది. రెండు వైపులా ఎర్రని గీతలతో ఆకర్షణీయంగా ఉంది. కాగా కొత్త జెర్సీతో తమ అదృష్టం మారి ట్రోపీ కొట్టాలని ఎల్ఎస్‌జీ భావిస్తోంది.