ఐపీఎల్ ప్లే ఆఫ్స్ పోరు రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 9 మ్యాచులు ఆడితే 8 గెలిచి గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తును కన్ఫామ్ చేసుకుంది. ఇక 9 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్కటే గెలిచిన ముంబై జట్టుకు ప్లే ఆఫ్స్ చాన్స్ లేదు. ఇక మిగతా మూడు స్థానాల కోసం 8 జట్లు పోటీ పడుతున్నాయి. లాస్ట్ మ్యాచ్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్ కూడా తాము ఇంకా రేసులోనే ఉన్నామని ప్రత్యర్థికి హెచ్చరికలు పంపింది. లక్నో, రాయల్స్, ఆర్సీబీ, కేకేఆర్ పదేసి మ్యాచులు ఆడగా.. ఎస్ఆర్‌హెచ్, డీసీ, పంజాబ్, చెన్నై జట్లు 9 మ్యాచులు ఆడి ఉన్నాయి. మరి ఈ 8 జట్లలో ఆ మూడు స్థానాలను ఏ జట్లు దక్కించుకుంటాయో వేచి చూడాలి.