ఈ నెల 31 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రసారకర్త స్టార్‌స్పోర్ట్స్ ఐపీఎల్ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ ప్రోమో క్రికెట్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. టాటా ఐపీఎల్.. షోర్ ఆన్.. గేమ్ ఆన్! అంటూ ప్రకటించారు. ఇందులో భారత స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఉన్నారు. కానీ ధోనీ ఫొటో లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ ట్రోల్స్‌కు దిగుతున్నారు. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.