IPL సీజన్-15 తుది అంకానికి సర్వం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో ఒకటి, రెండు స్థానాలను అధిరోహించిన గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య నేడు క్వాలిఫైయర్-1 మ్యాచ్ జరుగనుంది. బౌలింగ్ బలంతో గుజరాత్, బ్యాటింగ్ బలంతో రాజస్థాన్ బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లకు విజయావకాశాలు దాదాపు సమానంగా ఉన్నాయి. కాని గుజరాత్ తరఫున ఓపెనర్లు సాహా, గిల్ సమష్టిగా రాణించడంతో పాటు బౌలర్లు షమీ, రషీద్, ఫెర్గూసన్ రాణిస్తే రాజస్థాన్ని తక్కువ పరుగులకే కట్టడి చేయోచ్చు. అలాగే రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్, చాహల్ కీలకంగా మారనున్నారు. బట్లర్, సంజూ శాంసన్, హిట్ మేయర్, పడిక్కల్ లాంటి హిటర్లు క్రీజులో నిలదొక్కుకుంటే పరుగుల వరద పారే అవకాశం ఉంది. కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ సమరంలో గెలిచిన జట్టు ఫైనల్‌కి చేరుకుంటుంది.