ఈ వీడియోలో ఒక వ్యక్తి బురద నీటిలో సైకిల్‌పై పెద్ద మూట పెట్టుకొని వెళ్తున్నాడు. అయితే ఆ నీటిలో కాళ్లు పెట్టకుండా పక్కనున్న గోడపై కాళ్లుపెట్టి స్పైడర్‌మ్యాన్‌లా నడుస్తూ సైకిల్‌ను నీటిలో నడిపిస్తూ వెళ్లాడు. ఐపీఎస్ స్వాతి లక్రా ఈ వీడియోను షేర్ చేశారు. క్యాప్షన్ దిస్ అని అడిగారు. ఈ వ్యక్తి టాలెంట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. మీరు కూడా ఒకసారి వీడియో చూసి దానికి క్యాప్షన్ ఏమిస్తారో చెప్పండి.