ఇటీవల ఇరాన్‌లో మహిళలు ఇస్‌క్రీం తింటున్నట్లుగా రెండు యాడ్స్ రిలీజ్ చేశారు. అయితే అందులో మహిలు హిజాబ్‌ను నిర్లక్ష్యం చేయడంతో పాటు వారిని అసభ్యకరంగా చూపించారంటూ ఇరాన్ మతపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యాడ్స్ మహిళల గౌరవాన్ని మంటకలిపే విధంగా ఉన్నాయంటూ ఆ ఐస్‌క్రీం కంపెనీ డోమినోస్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో దేశ సాంస్కృతిక శాఖ మహిళలకు ఐస్‌క్రీం యాడ్స్‌లో నటించడానికి వీల్లేదంటూ యాడ్ ఏజెన్సీలకు లేఖ రాసింది. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు హిజాబ్ తప్పనిసరి చేశారు.