భార్యతో బలవంతపు శృంగారం చేయవచ్చా అనే పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ నిర్వహించింది. ఈ విచారణలో హైకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ షక్దర్, జస్టిస్ సి.హరిశంకర్ రెండు భిన్న తీర్పులను వివరించారు. మహిళలపై బలవంతపు శృంగారానికి పాల్పడితే అది రేప్ కిందికి వస్తుంది. కానీ ఇందులో భర్తలకు మినహాయింపు ఇచ్చారు. దీనిని సాకుగా చూపి, బలవంతపు శృంగారం లీగల్ అని చెప్పలేమని, అలా చెప్తే మహిళల హక్కులకు భంగం వాటిల్లుతుందని రాజీవ్ షక్దర్ తీర్పు చెప్పారు. దీనిని జస్టిస్ సి.హరిశంకర్ వ్యతిరేకించారు. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం బలవంతపు శృంగారం విషయంలో భర్తలకు ఇచ్చిన మినహాయింపులేవి మహిళల హక్కులకు భంగం కలిగించవని, ఈ అంశాన్ని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.