బీజేపీ అఖండ మెజార్టీకి కారణం అతనేనా?

© ANI Photo

వరుసగా ఏడోసారి బీజేపీ గుజరాత్‌లో అధికారం చేపట్టబోతోంది. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించారు. 2017తో పోల్చుకుంటే ఈ సారి అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. అయితే, దీనికి కారణం మోదీ అని చెబుతున్నా, పరోక్షంగా దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ లేకపోవడం అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. 2018లో అన్నీ తానై కాంగ్రెస్‌ను అహ్మద్ పటేల్ ముందుండి నడిపించారు. దాదాపు కాంగ్రెస్‌ను గెలిపించేంత పనిచేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 77 సీట్లు దక్కాయి. 41శాతం ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. అయితే, 2020లో ఆయన పరమపదించారు. దీంతో పాటు పాటిదార్ వర్గానికి చెందిన హార్దిక్ పటేల్ కూడా ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరడంతో ఇక ప్రధాన ప్రత్యర్థులెవరూ లేకుండా పోయింది. ఆ సీట్లే ఇప్పుడు బీజేపీకి ప్లస్సయ్యాయి.

Exit mobile version