తన కాలేజీ చదువును పూర్తి చేయలేకపోయినందుకు ఇప్పటికీ పశ్చాత్తాప పడుతుంటానని ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ అన్నారు. తన 16 ఏళ్ల వయసులో 1978లో అహ్మదాబాద్ నుంచి ముంబై ట్రైన్ ఎక్కేశానని చెప్పారు. తన తొలి సంపాదన మూడేళ్ల తర్వాత గానీ దక్కలేదని పేర్కొన్నాడు. ఒక జపాన్ వ్యాపారికి డైమండ్ అమ్మిపెట్టగా రూ.10 వేల కమీషన్ వచ్చిందని తెలిపాడు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలే దని చెప్పాడు. అదానీకి సోలార్, సిమెంట్, ఎయిర్పోర్ట్స్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.