TS: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాలపై సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై తొలుత ప్రెస్‌మీట్ నిర్వహిస్తారని ప్రచారం జరిగినా కేసీఆర్ మౌనంగా ఉన్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్, హరీశ్‌రావులతో కలిసి సుధీర్ఘ సమీక్షలు జరిపారు. ఈ వ్యవహారాన్ని జాతీయ వేదికపై ప్రశ్నించేందుకు పావుగా వాడుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వివిధ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌కి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీసినట్లు సమాచారం.
కేసీఆర్ మౌనం అందుకేనా..?

© ANI Photo(file)