టీమిండియా బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చితకొట్టాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. వన్డే కెరీర్‌లో తొలి శతకంతో పాటు డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సిక్సులు, ఫోర్లతో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చూడచక్కనైన షాట్లు ఆడుతూ ప్రేక్షకులను అలరించాడు. తక్కువ బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కోహ్లీ తనకు సహకారం అందిస్తూనే తనదైన స్టైల్‌లో బ్యాటింగ్ చేశాడు.