ICC ర్యాంకింగ్స్ లో 68 స్థానాలు ఎగబాకి ఇషాన్ కిషన్ 7వ స్థానం

Courtesy Instagram:

భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ఏకంగా 68 స్థానాలు ఎగబాకి బ్యాట్స్ మెన్లలో ఏడో స్థానానికి చేరుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ICC T20 ర్యాంకింగ్స్‌లో ఇషాన్ ఈ ఘనతను సాధించాడు. దేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న T20 సిరీస్‌లో భాగంగా 3 మ్యాచుల్లో కిషన్ రెండు హఫ్ సెంచరీలతోపాటు 164 పరుగులు చేశాడు. దీంతో T20 బ్యాటర్లలో టాప్ 10లోకి దూసుకెళ్లాడు. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ 14, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ 16, 17, 21 ర్యాంక్‌లు సాధించారు. మరోవైపు బౌలర్లలో భువనేశ్వర్ 11, చాహల్ 26వ ఉత్తమ ర్యాంకులకు చేరుకున్నారు.

Exit mobile version