బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ శతకొట్టాడు. కెరీర్‌లో తొలి వన్డే సెంచరీ నమోదు చేశాడు.
బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 85 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడాడు. 15 పరుగల వద్దే ధావన్ ఔట్ అయినా సిక్సులు ఫోర్లతో అలరించాడు. 14 ఫోర్లు 2 సిక్సులు బాదాడు. ఇషాన్‌కి కోహ్లీ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహకారం అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా వెళుతోంది.