బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది. ఇషాన్ 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. 24 ఫోర్లు, 10 సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరో వైపు విరాట్ కోహ్లీ తన 72వ సెంచరీ బాది ఇండియా భారీ స్కోరుకు బాటలు వేశాడు. 91 బంతుల్లో 113 పరుగులు బాదాడు. బంగ్లా బౌలర్లలో ఎబాదత్ హుస్సేన్, షకీబ్, టస్కిన్లు తలో 2 వికెట్లు తీసుకున్నారు.