నాలుగో టెస్టులో సిరాజ్‌ని తప్పించి షమిని భారత్ జట్టులోకి తీసుకుంది. అయితే, సిరాజ్‌ని తప్పించడానికి పలు కారణాలున్నట్లు తెలుస్తోంది. మూడు టెస్టుల్లో సిరాజ్ కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. పైగా, మూడో టెస్టులో చివరి వికెట్‌గా వచ్చి త్వరగా వికెట్ సమర్పించుకున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ రనౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి ఖాతా తెరవకుండానే బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు ఇన్నింగ్సుల్లోనూ అక్షర్ పటేల్ నాటౌట్‌గా ఉన్నాడు. పైగా సిరాజ్‌తో పోలిస్తే షమి గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి. అందుకే హైదరాబాదీ ప్లేయర్‌కి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.