సిరియాపై ఇజ్రాయెల్ మిస్సైల్‌తో విరుచుకుపడింది. డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మిస్సైల్ దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు సిరియా సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుఝామున 2 గంటలకు ఈ దాడి జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎయిర్‌పోర్ట్‌ను మూసివేస్తున్నట్లు సిరియా ప్రకటించింది. ఈ విమానాశ్రయాన్ని కొంతకాలంగా ఇరాన్ వైమానికి దళం ఉపయోగించుకుంటోంది. ఈ కారణంగానే ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది.