ఇజ్రాయెల్లో మళ్లీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అధికార కూటమి పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మళ్లీ ఎన్నికలకు వెళ్లనున్నట్లు సోమవారం తెలిపింది. దీంతో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలి బెన్నెట్ పదవి నుంచి వైదొలగనున్నారు. కూటమి ప్రధాన అభ్యర్థి లాపిడ్ ప్రస్తుతం తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగనున్నారు. బెన్నెట్ ఏడాది క్రితం అధికారం చేపట్టినప్పటి నుంచి 8 పార్టీల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ క్రమంలో కూటమితో కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. మరోవైపు 2 నెలలకు పైగా పార్లమెంటులో మెజారిటీ లేకుండానే కొనసాగారు. దీంతో అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగనుండగా, మూడేళ్లలో ఇవి 5వ ఎన్నికలు కానున్నాయి.